Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో ఉన్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. జిందాల్ గ్రూపు ఛైర్పర్సన్గా ఉన్న సావిత్రి నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.89వేల కోట్లు)గా ఉంది. ఇంతక్రితం ఈ స్థానంలో చైనా రియాల్టీ కంపెనీ కంట్రీ గార్డెన్ సహ ఛైర్మన్ యాంగ్ హుయాన్ ఉన్నారు. ఇటీవల ఆమె సంపద 23 బిలియన్ డాలర్ల నుంచి 11 డాలర్లకు తగ్గింది. దీంతో ఆమె మూడో స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో చైనాకు చెందిన ఫాన్ హాంగ్విరు ఉన్నారు.