Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో హిందూత్వ శక్తుల ఆగడాలు
- తిప్పికొట్టిన డీవైఎఫ్ఐ.. 'సెక్యులర్ గేమ్స్'తో ముందుకు
తిరువనంతపురం : కేరళలో హిందూత్వ శక్తులు మతం పేరిట ప్రజలలో విభజనలు తీసుకురావటానికి అనేక ప్రయత్నాలను చేస్తు న్నాయి. ఇందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ కూడా విడిచిపెట్టటం లేదు. ఇందులో భాగంగా అక్కడి గ్రామాల్లో నిర్వహించే ఆటల పోటీలలోనూ మతాన్ని చొప్పించి 'రాజకీయం' చేయాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా కేవలం హిందువుల కోసమే ఆటల పోటీలను నిర్వహిం చింది. అయితే, సంఫ్‌ు మద్దతు కలిగిన హిందూత్వ శక్తుల కుటిల ప్రయత్నాలకు డీవైఎఫ్ ఐ అడ్డు కట్ట వేసింది. కుల, మతాలకతీతంగా 'సెక్యులర్ గేమ్స్' నిర్వ హించి తగిన సమాధానాన్ని చ్చింది. కాసర్గోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటకోత తర్వాత ఏర్పడే ఖాళీ స్థలాల్లో గ్రామాల ప్రజలు ఆటల పోటీలలో పాల్గొంటారు. అనేక స్పోర్ట్స్, ఆర్ట్స్ క్లబ్బులు ఇలాంటి గ్రామీణ క్రీడల్లో పాలు పంచుకుంటాయి. ఈ జిల్లాలో కొన్ని హిందూత్వ శక్తులు హిందువులకు మాత్రమే ఆటల పోటీల అంటూ ప్రచారాలు చేశాయి. సంఫ్‌ు మద్దతు కలిగిన వీర కేసరి క్లబ్.. బలూరు ప్రాంతంలోని పైవలికె పంచాయతీలో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించింది. మతం ఆధారంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న డీవైఎఫ్ఐ సభ్యులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని నిరసన తెలిపారు. పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు వీర కేసరి క్లబ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆటలలో మతం తీసుకువచ్చి విభజించే కాషాయశక్తులకు గట్టిగా సమాధానం చెప్పాలని డీవైఎఫ్ఐ నిర్ణయించుకున్నది. ఈ మేరకు కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలతో 'సెక్యులర్ ఆటలు' నిర్వహించింది. కబడ్డి, క్రికెట్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ వంటి అనేక ఆటలను నిర్వహించి ప్రజల్లో ఐకమత్యా న్ని, సోదరభావాన్ని కలిగించింది. డీవైఎఫ్ఐ ప్రయత్నాలను అన్ని వర్గాల ప్రజలు ఆదరిం చారు. ఈ ఆటల్లో అన్ని మతాలకు చెందినవారు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారనీ, హిందూత్వ శక్తుల విభజన విధానాలను తిప్పి కొట్టారని డీవైఎఫ్ఐ కాసర్గోడ్ జిల్లా సెక్రెటరీ రెజీశ్ వెల్లట్ తెలిపారు. కేరళ వంటి సెక్యులర్ రాష్ట్రంలో ప్రజల్లో ఐక్యతను నిలుపుతామని చెప్పారు.