Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెల వసూళ్లతో పోల్చితే 28 శాతం వృద్థి చోటు చేసుకుందని సోమవారం ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నాలుగు మాసాలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెరుగుతున్నాయని పేర్కొంది. గడిచిన జులై పన్నుల్లో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.25,751 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.32,807 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ.79,518కోట్లు, సెస్ రూ.10,920కోట్లు చొప్పున నమోదయ్యాయి.