Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటు
న్యూఢిల్లీ : ప్రపంచంతో పాటు భారత్‌ను భయపెడుతున్న మంకీపాక్స్ వైరస్‌పై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని పరిస్థితిని పర్యవేక్షించటానికి ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ టాస్క్ఫోర్సు నిర్ణయం తీసుకోనున్నది. దీనికి నిటి ఆయోగ్ సభ్యులు (హెల్త్) డాక్టర్ వీ.కే పాల్ నేతృత్వం వహించనున్నారు. గతంలోనూ ఈయన కరోనా వ్యవహారాలు చూశారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ టాస్క్ఫోర్సు దేశంలో రోగ నిర్ధారణ సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే, వ్యాధికి టీకాలు వేయటానికి సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ధోరణులను అన్వేషిస్తుంది. సోమవారం వరకు భారత్‌లో ఐదు మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి నమోదు కావటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమాచారం ప్రకారం.. 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం విదితమే.