Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
- ఎనిమిది మంది మృతి
- 13 మందికి తీవ్ర గాయాలు
జబల్పూర్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జబల్పూర్లోని గోహల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమోV్‌ా నక సమీపంలో ఉన్న న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణలో ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక కార్యక్రమాల సిబ్బంది చేరుకున్నారు. ఆస్పత్రిలోని రోగుల్నీ ఖాళీ చేయడానికి ప్రయత్నించారు. ఎనిమిది మంది మృతుల్లో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. కాగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. వైద్య చికిత్సలకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.