Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీకి అధికారాలు కట్టబెట్టడంపై సుప్రీం తీర్పు ప్రమాదకరం
- నీచమైన రాజకీయ ప్రతీకార చర్యలకు ఊతం
- 17 ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటన
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002కి చేసిన సవరణల (ఈడీకి అధికారాలు కట్టబెడుతూ)ను పూర్తిగా సమర్థిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రమాకరమని 17 ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. కనీసం ఈ సవరణల్లో కొన్నింటిని ఆర్థిక చట్టంతో అమలు చేయవచ్చో లేదో పరిశీలించకుండానే ఈ తీర్పు ఇచ్చిందని తెలిపాయి. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, ఆప్, శివసేన, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, కేరళ కాంగ్రెస్, ఆర్ఎల్డీ, జెఎంఎం, పార్టీల నేతలు సంతకాలు చేసి ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా ప్రకటనపై సంతకం చేశారు. తాము సుప్రీం కోర్టును అత్యంత గౌరవంగా చూస్తామనీ, ఎల్లప్పుడూ ఉంచుతామని తెలిపాయి. ఆర్థిక చట్టం పేరుతో సవరణలు చేసే రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి విస్తృత ధర్మాసనానికి పంపించాల్సిందిగా సూచించాయి. ఈ సవరణలు మనీలాండరింగ్‌లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు సంబంధించి చాలా కట్టబెట్టారని, అవి రాజకీయ ప్రత్యర్థులను దుర్మార్గంగా, దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నాయి. అత్యంత నీచమైన రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటున్నాయని విమర్శించాయి. ప్రమాదకరమైన ఈ తీర్పు స్వల్పకాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగపరమైన నిబంధనలు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపాయి.