Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. దేశంలో ఒక వ్యవస్థీకత డోపింగ్ విధానాన్ని రూపొందించేందుకు సంబంధించిన బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది. ఈ బిల్లును గత వారం లోక్సభ ఆమోదించగా..తాజాగా రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఏడాదికి ఆరువేల డోపింగ్ టెస్టులు నిర్వహిస్తుండగా, ఇకపై వీటి సంఖ్య గణనీయంగా పెరుగనుంది. ఇందుకోసం ఒక నిర్దిష్ట విధానం రూపొందించడమేగాక, పరిశోధనశాలల సంఖ్యను, సామర్థ్యాన్ని పెంచనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక విధానానికి మార్గం సుగమమైందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.