Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 34వేల మందికిపైగా మహిళలు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. వీరంతా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్..తదితర సాయుధ బలగాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు బుధవారం రాజ్యసభకు తెలిపారు. ''సాయుధ బలగాల్లో మహిళా రిజర్వేషన్లు అమలుజేయాలని జనవరి, 2016లో కేంద్రం నిర్ణయించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33శాతం, సరిహద్దు రక్షణ చూసే బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీలలో 14-15శాతం రిజర్వేషన్ అమలుజేస్తున్నాం. ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో 9454 మంది, బీఎస్ఎఫ్లో 7391 మంది, సీఐఎస్ఎఫ్లో 9320 మంది, ఐటీబీపీలో 2518 మంది, ఎస్ఎస్బీలో 3610మంది, అస్సాం రైఫిల్స్‌లో 1858 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. ఈ సాయుధ బలగాల్లో పనిచేస్తున్నవారి మొత్తం సంఖ్య సుమారుగా 10లక్షలు. శారీరక ధారుఢ్యం, శారీరక నైపుణ్య పరీక్షల్లో మహిళలకు కొన్ని మినహాయింపులు ఇచ్చాం. మహిళా సిబ్బందికి ప్రసూతి సెలవులు, బాలల సంరక్షణ సెలవులు కూడా వర్తింపజేశాం'' అని తెలిపారు. ప్రమోషన్లు, సీనియార్టీ అంశాల్లో మహిళా సిబ్బందికి సమాన అవకాశాలు కల్పించామన్నారు.