Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫార్సులు చేసింది. దీంతో ప్రస్తుతానికి ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు వెల్లడించారు. త్వరలోనే కొత్త బిల్లు తీసుకొస్తామని తెలిపారు. దేశంలో వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ 'వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్' బిల్లును ప్రతిపాదించింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపిం చాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి..నివేదికను రూపొందిం చింది. గతేడాది డిసెంబరులో ఈ నివేదికను పార్లమెంట్ ఉభయ సభలకు సమర్పించింది.
వ్యక్తిగత డేటాతోపాటు వ్యక్తిగతేతర డేటానూ ఈ ముసాయిదా చట్ట పరిధిలోకి తీసుకురావాలని, తదనుగుణంగా దీన్ని విస్రృత పరచాలని కమిటీ సూచించింది. సామాజిక మాధ్యమాల ను ప్రచురణకర్తలుగా పరిగణించి, వాటిని మరింత జవాబుదారీ చే యాలని పేర్కొన్నది. డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయడం తోపాటు, అన్ని స్థానిక, విదేశీ సంస్థలు నిబంధనలను సక్రమంగా పాటి ంచేలా పర్యవేక్షించాలని సూచించింది. ఇలా బిల్లుకు కమిటీ 81 సవ రణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకుం టున్నట్టు ప్రకటించింది. త్వరలోనే సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా కొత్త బిల్లును తీసుకురానున్నట్టు వెల్లడించింది.