Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సైనికులకు పోస్టులు
- కేంద్ర మంత్రి అజయ్ భట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల్లో మాజీ సైనికులకు కేవలం 0.37 శాతమే గ్రూప్ డీ పోస్టులు భర్తీ చేసినట్టు రక్షణ శాఖ సహాయ అజయ్ భట్ తెలిపారు.లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధా నం ఇచ్చారు. గ్రూప్ సీ పోస్టులు 1.14శాతం మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు.
ఇండియన్ ఆర్మీలో 1,08,685 జవాన్ల కొరత
ప్రస్తుతం భారత సైన్యంలో 1,08,685 మంది జవాన్ల కొరత ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్ తెలిపారు. లోక్సభలో ఒకప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సగటున, ప్రతి ఏడాది మూడు సర్వీసుల్లో 60,000 ఖాళీలు జరుగుతాయని, వీటిలో సుమారుగా ఆర్మీకి 50,000 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. గతేడాది ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగలేదని తెలిపారు.