Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 744 మంది ఎంపీలు
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
న్యూఢిల్లీ : నేడు 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పార్లమెంటులో మొదటి అంతస్థులో రూం నెంబర్ 63లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు చేసి, ఫలితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ద్విముఖ పోటీ నెలకొంది. అధికార బీజేపీ తరపున జగదీష్ ధన్కర్ పోటీ చేయగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. ప్రస్తుత బలాబలాలను బట్టీ బీజేపీ అభ్యర్థి జగదీష్ ధన్కర్కే సానుకూలంగా ఉంది. 543 లోక్‌సభ, 233 రాజ్యసభ, 12 మంది నామినేటెడ్ రాజ్యసభ ఎంపీలతో కలిపి మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉండగా, అందులో జమ్మూకాశ్మీర్ నాలుగు, త్రిపుర 1, నామినేటెడ్ 3, మొత్తం ఎనిమిది మంది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 780 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇప్పటి టీఎంసీ ఎన్నికలను బహిష్కరింది. ఆ పార్టీకి రాజ్యసభలో 13 మంది, లోక్‌సభలో 23 మంది ఎంపీలున్నారు. వీరు ఓటింగ్‌లో పాల్గొనరు. దీంతో ఓటింగ్‌లో పాల్గొనే వారి సంఖ్య 744కి తగ్గింది. ఇందులోనూ ఈడీ కేసులో అరెస్టు అయిన శివసేన ఎంపీ సంజరు రౌత్ వంటి ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఓటింగ్‌లో పాల్గొనే వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది.బీజేపీ అభ్యర్థి జగదీష్ ధన్కర్కు బీజేపీ, జేడీయూ, బీజేడీ, అన్నాడీఎంకే, శివసేన (ఏక్నాథ్ షిండే), వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, ఎస్ఏడీ, ఆర్ఎల్జేపీ, అప్నాదళ్, ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎంఎన్ఎఫ్, ఏజేఎస్‌యూ, ఎన్డీపీపీ, ఎస్కేఎం, ఆర్పీఐ, ఏజీపీ, పీఎంకే, టీఎంసీ-ఎం, యూపీపీఎల్, ఆర్ఎల్పీ, ఎస్డీఎఫ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్, టీఆర్ఎస్, ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం, శివసేన (ఉద్దవ్ ఠాక్రే గ్రూప్), ఎండీఎంకే, ఆర్ఎల్డీ, ఐయూఎంఎల్, కేసీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, వీసీకే, ఆర్ఎస్పీ, ఏజీఎం, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్, జేడీఎస్ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంమేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు శ్రీమతి మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు.