Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భావ ప్రకటన హక్కులోనే ఇది ఉంటుంది : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా ఒకరి అభిప్రాయాలను ప్రచురించే, ప్రసారం చేసే హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే, భావ వ్యక్తీకరణ హక్కులో.. సోషల్ మీడియాలో లేదా టీవీ ఛానెల్లో వచ్చిన కంటెంట్‌పై వ్యాఖ్యానించే (కామెంట్) హక్కు ఉన్నదని వివరించింది.
తన వార్తా ప్రసారాన్ని, యాంకర్లను తన కంటెంట్ ద్వారా అపహాస్యం, పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఒక మీడియా సంస్థ ఆన్లైన్ న్యూస్ పోర్టల్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, సదరు మీడియా సంస్థ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. వాది (మీడియా సంస్థ) పేర్కొన్న విధంగా మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసే అంశాలు లేవని పేర్కొన్నది. దీంతో ఆన్లైన్ న్యూస్ పోర్టల్‌కు ఉపశమనం లభించింది. వివాదం పూర్తిగా వాణిజ్యపరమైనది కానందున నిషేధానికి సంబంధించిన దరఖాస్తును స్వీకరించలేమని ప్రతివాది వాదించారు.
న్యాయస్థానం తీర్పుపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రతివాది విమర్శించే హక్కుపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించలేదనీ, పరువు నష్టం, వాక్ స్వాతంత్య్రానికి మధ్య జరిగిన చర్చలో తూట్లు పొడవలేదన్నారు. వార్తల రిపోర్టింగ్‌లో వైవిధ్యాన్ని గుర్తించటంపై కోరు కీలక పరిశీలన చేసిందన్నారు. '' టీవీ లేదా సోషల్ మీడియా వేదికలలో ప్రతి మీడియా హౌజ్, ఛానెల్, ప్రతివాదులు వారి స్వంత తత్వాన్ని కలిగి ఉంటారు. ఇది కార్యక్రమాలు, కంటెంట్లలో ప్రతిబింబిస్తుంది'' అని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.