Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: దేశ 14వ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మెన్‌గా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్లో జగదీప్ ధన్కర్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు ఎం. వెంకయ్యనాయుడు, హమీద్ హన్సరీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హౌం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూశ్ గోయల్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, ఎస్.జైశంకర్,స్మృతి ఇరానీలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తదితరులు పాల్లొన్నారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
వృత్తిరీత్యా లాయర్ గా...
జగదీప్ ధన్కర్ వృత్తి రీత్యా లాయర్. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. రాజస్థాన్ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్కర్.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలు అందించారు.