Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన కేరళ మాజీ మంత్రి
తిరువనంతపురం : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రతీకార చర్యగా కేరళ మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం. థామస్ ఇసాక్ అన్నారు. తనకు పంపిన రెండు సమన్లను రద్దు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డు లావాదేవీలకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. తాజా సమన్లలో ఆగస్టు 11న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధమని ఇసాక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. '' నేను వారిని (ఈడీ) సమన్లను వెనక్కి తీసుకోవాలనీ లేదా నాకు లేదా కేఐఐఎఫ్బీకి వ్యతిరేకంగా చేసిన నేరాన్ని స్పష్టం చేయాలని కోరాను'' అని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఫెమా రెగ్యులేటర్ అయిన ఆర్మీఐకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు ఈడీకి ఆందోళన ఎందుకు? అని ప్రశ్నించారు. తాను చేసిన ఉల్లంఘనల స్వభావాన్ని ఈడీ వివరించలేదన్నారు. ఇది రాజకీయ ప్రతీకారానికి సంబంధించిన కేసు అని ఆరోపించారు. కేఐఐఎఫ్బీ ద్వారా బాండ్ల జారీని విచారించే అధికారం ఈడీకి లేదని ఆయన తెలిపారు.