Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వాలు
- నాలుగు వేల కోట్లు తగ్గిన రాష్ట్ర నికర రుణ పరిమితులు
- కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్
తిరువనంతపురం : రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణాత్మక లేఖ రాశారు. రాష్ట్రాలకు రుణాలు తీసుకునే ఆర్థిక స్వేచ్ఛను కేంద్రం యథేచ్ఛగా హరిస్తున్నదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా ఆఫ్బడ్జెట్ రుణాల పేరుతో రాష్ట్ర నికర రుణ పరిమితులను దాదాపు రూ. 4000 కోట్ల మేర తగ్గించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
బాలగోపాల్ లేఖ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌కు ఆర్థిక సహాయం చేయటానికి అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులలో రూ. 23 వేల కోట్ల తగ్గింపుతో కేరళ ప్రభుత్వం పోరాడవలసి ఉంటుంది. ఇది పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమానికి ఆర్థిఖ సహాయం చేసే ప్రభుత్వ సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) రుణాలు సేకరించే అధికారాన్ని రాష్ట్రానికి కట్టబెట్టింది. ఈ నిబంధన ప్రకారం, కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఏదైనా రుణాన్ని పొందదు. ఆర్టికల్ 293(3)లో కనిపించే 'ఏదైనా రుణం' అనే పదాన్ని తప్పనిసరిగా కేంద్రం అందించే ఏదైనా రుణంగా చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవటానికి సంబంధించిన అభ్యర్థనకు సంబంధించిన షరతులు విధించటం కోసం ఆర్టికల్ 293(3) ఉపయోగిం చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రుణాలను నియంత్రిం చటానికి దీనిని ఉపయోగించలేరు. రాజ్యాంగం ప్రకారం ఇవి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అంశాలు. ఆర్టికల్ 283(2) రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం. ఇది పబ్లిక్ ఖాతాను నియంత్రించే అధికారాలను రాష్ట్రాలకు అందిస్తుంది. భారత ప్రభుత్వ నిర్ణయం అవహేళనగా అనిపిస్తుంది. ఇది బీజేపీ, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మధ్య సమాఖ్య సంబంధాలలో దీర్ఘకాలిక వైరుధ్యాలకు దారి తీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.