Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం వద్దు
న్యూఢిల్లీ : 'సాలు దొర.. సెలవు దొర' పేరుతో కౌంట్‌డౌన్ మొదలైందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)నిలుపుదల చేసింది. సీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ అనుమతి కోరగా ఎన్నికల సంఘం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోడీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయనపై విమర్శలతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ తర్వాత కేసీఆర్‌పైనా పలు ఆరోపణలు చేస్తూ కొన్ని చోట్ల పోస్టర్లు కనిపించిన విషయం తెలిసిందే.