Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పసి పిల్లలు తాగే పాలు నుంచి స్మశాన వాటికలపై పన్నులు వేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటి అద్దెలపై కూడా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించాలని నిర్ణయించింది. ఇకపై ఇంటి అద్దెపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే.. వ్యక్తిగత అవసరాలకు అద్దెకు తీసుకున్నప్పుడు వర్తించదని తెలిపింది. గత నెలలో చంఢగీడ్లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అద్దెలపై పన్నుకు సంబంధించిన కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. అద్దెకు ఉంటున్న ప్రతీ ఒక్కరూ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తాజాగా కేంద్రం వివరణ ఇచ్చింది. కేవలం వాణిజ్య అవసరాల కోసం ఏదైనా ఆస్తిని అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అందులోనూ జీఎస్టీలో రిజిస్టర్ అయినవాళ్లు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తారని తెలిపింది. ఈ ఏడాది జులై 18 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. రిజిస్టర్డ్ కంపెనీ లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ఈ నిబంధన పెద్ద వ్యాపారులకు మాత్రమే అమలు చేసినప్పటికీ.. భవిష్యత్తులో మిగతా అద్దెదారులకు వర్తింపజేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే జీఎస్టీ తెచ్చిన తొలినాళ్లలోనూ పలు నిత్యావసరాలు, అహారోత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ వేయబోమని మోడీ సర్కార్ హామీ ఇచ్చింది. తర్వాత కాలంలో పాలు,మజ్జిగ అనే తేడాలేకుండా అన్ని ఉత్పత్తులను కూడా పన్ను పరిధిలోకి తెచ్చి.. ప్రజలపై భారాలను మోపిన విషయం తెలిసిందే.