Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షలను కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే విద్యార్థులు ఒకే పరీక్ష రాసి, ఎవరికి నచ్చిన కోర్సుల్లో వారు చేరేందుకు అవకాశముంటుందని యూజీసీ చైర్పర్సన్ ఎం.జగదేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-యూజీలో మ్యాథ్స్‌కి బదులు బయాలజీ ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా రెండు సబ్జెక్టులు సేమ్. జేఈఈ, నీట్‌ని కలిపి సీయూఈటీ-యూజీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహించాలని యూజీసీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు పరీక్షలకు 43 లక్షల మంది వరకూ హాజరవుతున్నారు. ప్రస్తుతం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో మూడు ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి వస్తోందని, ఇకపై అలాంటి అవసరం ఉండదని జగదేశ్ కుమార్ తెలిపారు. సీయూఈటీ-యూజీ ని ఏటా బోర్డు పరీక్షలు పూర్తయ్యాక ఒకసారి, డిసెంబర్లో మరోసారి రాసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలను చేపట్టి, ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు.