Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పత్తి, అమ్మకాలు నిలిపివేత
న్యూఢిల్లీ : తీవ్ర క్యాన్సర్కారక ఆరోపణలు ఎదుర్కొన్న జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్జే) టాల్కమ్ పౌడర్ తయారీని ఎట్టకేలకు నిలిపివేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. పసి పిల్లల టాల్కమ్ పౌడర్లో గుత్తాధిపత్యాన్ని కలిగిన ఈ కంపెనీ ఇకపై తన ఉత్సాదన, విక్రయాలను నిలిపివేస్తు న్నట్టు వెల్లడించింది. ఈ పౌడర్లో ఉపయోగించే ఆస్బెస్టాస్ క్యాన్సర్ కారకంగా మారుతోందని పలు పరిశోధనల్లో తేలింది. మరోవైపు దీనిని వాడిన పలువురు వినియోగదారులు తాము క్యాన్సర్ బారిన పడ్డామని ప్రపంచ వ్యాప్తంగా అనేక న్యాయసా ్థనాల్లో కేసులు వేశారు. అమెరికా, కెనడాలోనూ ఈ ఉత్పత్తులపై నిషేధం ప్రకటించారు. ఈ క్రమంలోనే వాణిజ్య పరంగా అనేక సమీక్షాలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి అమ్మకాలను నిలిపివే యాలని నిర్ణయించినట్టు తెలిపింది.