Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరుకు రైతుల రాస్తారోకో
- కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరపై ఆగ్రహం
- విద్యుత్ సవరణ బిల్లు రద్దుకు డిమాండ్
న్యూఢిల్లీ : కర్నాటకలో శనివారం చెరుకు రైతులు చేపట్టిన 'హైవే బంద్' విజయవంత మైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతులు జాతీయ రహదార్లమీదకు వచ్చి..రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేవనాగరే, గుల్బర్గా, బెల్గాం, గడాగే, బాగల్కోట్, ధార్వాడ్, మైసూర్, చామరాజ్నగర్, నాంజన్గుడు, టి నర్సిపూర్, బన్నూర్..మొదలైన నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదార్లపై వేలాది వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మైసూర్లో కొలంబియా హాస్పిటల్ సర్కిల్ వద్ద జరిగిన రాస్తారోక్లో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. దాంతో కొన్ని గంటలపాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. చెరకు పంటపై కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లు-2022కు వ్యతిరేకంగా రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా చెరుకు రైతులు ఆందోళనలు జరుపుతున్నారు.
విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించటాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శనివారం నాటి రాస్తా రోక్పై చెరుకు పెంపకందార్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు కుర్బుర్ శాంత కుమార్ మాట్లాడుతూ..''ఒక బ్యాగ్ పొటాష్ ఎరువు ధర రూ.900 పెరిగింది. డీఏపీ ధర రూ.350 పెరిగింది. పంట సాగులో కూలి రేట్లు రూ.400 వరకు పెరిగాయి. విత్తనాల ధరలు ఎకరాకు రూ.500 పెరిగింది. ఇంత జరుగుతుంటే, కేంద్రం ప్రభుత్వం చెరుకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.15 పెంచింది. ఇది ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదు'' అని అన్నారు. రాష్ట్రంలో చెరుకు రైతులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. పంట సాగు ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. ఒక టన్ను చెరుకుపై రైతుకు భారీ మొత్తంలో నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. చక్కెర్ మిల్లుల యజమానులు చెప్పినట్టు కేంద్రం తలాడిస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. మిల్లు యజమానులు రైతుల నుంచి కొనుగోలు చేసే దాంట్లో 'బేస్ రికవరీ రేట్' (తరుగు కింద) 10శాతం పట్టుకునేవారు. దీనిని కేంద్రం 10.25శాతానికి పెంచింది. అలాగే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను అడ్డుకునేం దుకు విద్యుత్ సవరణ బిల్లు-2022ను తీసుకొస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''పాల పదార్థాలపైనా కేంద్రం జీఎస్టీ విధించింది.