Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాజధానిలో పోలీసులు అలర్ట్
- 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో భారీ సెక్యూరిటీ
- ప్రతి చోటా నిఘా కెమెరాల ఏర్పాటు
- ఎర్రకోట వద్ద వేడుకలకు ఏడు వేల మంది ఆహ్వానితులు
న్యూఢిల్లీ : భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్న ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) కెమెరాలనూ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట వద్దకు దాదాపు ఏడు వేల మంది ఆహ్వానితులు రానున్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మారక చిహ్నం చుట్టూ 10 వేల మంది పోలీసులు మోహరించనున్నారు. వైమానిక ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఏవైనా బెదిరింపులను ఎదుర్కోవటానికి తగిన ఏర్పాట్లను చేశారు. ఎర్రకోట చుట్టూ ఐదు కిలోమీటర్ల ప్రాంతం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వరకు ''నో కైట్ ఫ్లయింగ్ జోన్''గా గుర్తించారు. రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), ఇతర భద్రతా ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. '' ఎర్రకోట చుట్టూ హై రిజల్యూషన్ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వాటి ఫుటేజీని 24 గంటలు పరిశీలిస్తున్నాం. ఈ సారి ఆహ్వానితుల సంఖ్య 7000కి పెరిగింది'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లు, రిమోట్ కంట్రోల్డ్ కార్ కీలు, సిగరెట్ లైటర్లు, బ్రీఫ్ కేసులు, హ్యాండ్ బ్యాగులు, కెమెరాలు, బైనాక్యులర్లు, గొడుగులు ఇలాంటి వస్తువులు ఎర్ర కోట ప్రాంగణంలోకి అనుమతించబోమని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే 144 సెక్షన్‌ను అమలు లోకి తెచ్చి నట్టు శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్ దేవే ంద్ర పాఠక్ తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఎర్రకోటలో కార్యక్రమం ముగిసే వరకు ఎవరైనా గాలిపటాలు, బెలూన్లు ఎగురవేస్తే శిక్షించబడతారని చెప్పారు. ఆనంద్ విహార్ అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ సమీపంలో 2200 లైవ్ కాట్రిడ్జ్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటన లో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇటు నిఘా విభాగం హెచ్చరికలతో పోలీసులు పెట్రోలింగ్, తనిఖీలను ముమ్మరం చేశారు. హౌటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తున్నా మనీ, అద్దెదారుల, సేవకుల వెరిఫికేషన్‌ను నిర్వహి స్తున్నామని అధికారులు చెప్పారు.