Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో మోడీ ప్రధానీగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అదానీ పెట్టుబడులు, ఇతర కంపెనీల స్వాధీనాలు, ఆదాయాలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా అంబుజా, ఎసిసి సిమెంట్ కంపెనీల్లో అదానీ గ్రూపు వాటా కొనుగోళ్లకు కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ రెండు సిమెంట్ కంపెనీల్లోనూ స్వీడన్‌కు చెందిన హోలిమ్స్‌కు వాటాలు ఉన్నాయి. ఆ వాటాలను అదానీ గ్రూపునకు చెందిన ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అంబుజా సిమెంట్‌లోని 89.11 శాతం వాటా, ఎసిసిలోని 80.53 శాతం వాటాను అదానీ గ్రూపు రూ.81వేల కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు గత నెలలలోనే ప్రకటించింది.