Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ప్రొఫెసర్లుసహా నలుగురు ఉద్యోగుల తొలగింపు
- జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ ఆదేశాలు
- ఇప్పటివరకు 40 మంది...
శ్రీనగర్ : ఇద్దరు ప్రొఫెసర్లు సహా నలుగురు ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం శనివారం తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో జమ్ముకాశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జెకెఇడిఐ)లో ఐటి మేనేజర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయూద్ ఉన్నారు. ఆయన హిజుబుల్ ముజాయిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో అరెస్టయిన బిట్టా కరాటే అలియాస్ ఫరూఖ్ అహ్మద్ దార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన భార్య, జమ్ముకాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అస్సాబా- ఉల్- అర్జామంద్ ఖాన్ ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరితోపాటు కాశ్మీర్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సైంటిస్ట్ డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, అదే యూనివర్శిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్ కదిరిలను ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర భద్రతా ప్రయోజనాలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడుతున్నారని లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు వచ్చిన సమాచారం ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఆ నలుగురిని తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్టికల్ ఎటువంటి విచారణ లేకుండా ప్రభుత్వం ఉద్యోగులను తొలగించేందుకు వీలు కల్పిస్తుంది. ఎల్జి నేతృత్వంలోని అడ్మిన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన తరువాత తొలగించిన ఉద్యోగుల సంఖ్య 40కి పెరిగింది. తమను ఏకపక్షంగా తొలగించారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధుత్వాల ఆధారంగా ఉద్యోగులను తొలగించడం విచారకరమని సీనియర్ రాజకీయ నాయకుడు సజాద్ లోనే ట్వీట్ చేశారు.