Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ప్రొఫెసర్‌కు జేవియర్స్ యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు
- క్యాంపస్‌లో నిరసన
కోల్‌కతా: సోషల్‌మీడియాలో తనకు సంబంధించిన కొన్ని చిత్రాల కారణంగా రాజీనామా చేసిన కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ (ఎస్ఎక్స్యూ) ఆంగ్ల మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తున్నది. తామంతా ప్రొఫెసర్ వెంట ఉంటామని వర్సిటీ విద్యార్థులు తెలిపారు. మాజీ ప్రొఫెసర్‌కు సంఘీభావంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు నల్లటి దుస్తులు ధరించి న్యూటౌన్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో సమావేశమయ్యారు. మాజీ ప్రొఫెసర్‌కు సంఘీభావంగా నిశబ్ద నిరసనను తెలిపారు. అయితే, యూనివర్సిటీ చరిత్రలో విద్యార్థులు ఇలా నిరసనలు చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. పార్క్ స్ట్రీట్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీ క్యాంపస్ కూడా గత 30 ఏండ్లలో కనీసం క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనను చూడలేదు. ఎస్ఎక్స్యూ- కోల్‌కతా మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వేధించారనీ, అవమానించి గతేడాది బలవంతంగా రాజీనామా చేయించినట్టు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అధ్యాపకురాలి ఫోటోలు అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయనీ, వాటిని తరచూ తన కొడుకు చూస్తున్నాడని ఒక విద్యార్థి తండ్రి మాజీ ప్రొఫెసర్‌పై యూనివర్సిటీకి లేఖ రాశారు. అనంతరం సదరు ప్రొఫెసర్ రాజీనామా చేయటం గమనార్హం. అయితే, ఈ చర్య ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని కలకలం రేపింది. ఇది స్త్రీ ద్వేషం, వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరింలా ఉన్నదనీ, పితృస్వామ్య వ్వవస్థకు దర్పణమని సామాజికవేత్తలు ఆరోపించా రు. జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని కవర్ చేసింది. ప్రస్తుత తరుణంలో వర్సిటీ విద్యార్థులు మాజీ ప్రొఫెసర్‌కు బాసటగా నిలవటం గమనార్హం.