Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీపంలోని దుకాణాల సీజ్
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట, దాని పరిసర ప్రాంతాలు పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లాయి. డ్రోన్ వంటి ఏ ఇతర వస్తువులతో ముప్పుకలగకుండా రాడర్ వ్యవస్థ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశంలో ఏ విధమైన అనుమాస్పద వస్తువు కనిపించినా పోరాటం చేయడానికి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఎర్రకోట సమీపంలోని దుకాణాలను సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో గాలిపటాలను ఎగరువేయడాన్ని పూర్తిగా నిషేధించారు. గాలిపటాలు వంటి ఎగిరే వస్తువులతో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సుమారు 300 మంది ప్రముఖలు పాల్గొననున్నారు. అలాగే సుమారు 10 వేల మంది ప్రజలు హజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం స్వల్ప అవాంచనీయ సంఘటన కూడా జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులు స్థానిక నేరస్థులతో కలిసి ఎలాంటి దాడి చేయకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో సంబంధాలు, దేశ వ్యతిరేక కార్యాక్రమాలకు పాల్పడే అవకాశముందని అనుమానం ఉన్న 1000 మంది అనుమానాస్పద వ్యక్తుల చిత్రాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.