Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో అపార అనుభవం కలిగిన ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్ వాలా హఠాన్మరణం చెందారు. ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఉదయం 6.45 గంటలకు గుండెపోటుకు గురైయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్‌కి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అప్పటికే రాకేశ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వ్యాది నయం కోసం ఇటీవల ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన కుటుంబం హైదరాబాద్‌లో తండ్రికి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం వచ్చింది. ఈ నగరంలోనే ఝుంఝున్వాలా 1960లో జన్మించారు. తర్వాత రెండేళ్లకే తండ్రి రాధేశ్యామ్‌కు ముంబయికి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధానీ నరేంద్ర మోడీ సహా పారిశ్రామిక వర్గాలు సంతాపం ప్రకటించాయి. ఇటీవలే ఆయన ఆకాశ్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఝుంఝున్వాలా మృతితో ఇక ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉండొచ్చో వేచి చూడాలి.