Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజు మొత్తం కష్టపడినా దక్కేది తక్కువే
- తిండి లేక పూట గడవటమూ కష్టమే
- డ్రయినేజీల పక్కన నివసిస్తున్న దుస్థితి
- ఆరోగ్య సమస్యలతో సతమతం
- ఢిల్లీలోని సీలంపూర్‌లో దృశ్యాలు
న్యూఢిల్లీ : దేశరాజధాని న్యూఢిల్లీ శివారులో గల సీలంపూర్ ఈ-వ్యర్థాల కు అతిపెద్ద మార్కెట్. ఇక్కడ వందలాది మంది కార్మికులు దీనిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర ఏదైనా ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో నిండిన డంప్ ట్రక్కులను నడుపుతున్న దృశ్యాలు అక్కడి ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఈ-వ్యర్థాలపై ఆధారపడి దాదాపు 50 వేల మంది పురుషులు, మహిళలు జీవిస్తున్నా రని అంచనా. అయితే, ఈ మార్కెట్‌పై ఆధారపడి ఈ-వ్యర్థాలను సేకరిస్తున్న వీరి జీవన పరిస్థితులు మాత్రం అగమ్యగోచరంగా ఉన్నాయి. కష్టం కొండంత ఉంటే.. దక్కేది మాత్రం స్వల్పంగానే ఉంటున్నది. కూడు, గూడు లేక డ్రయినేజీల పక్కన నివసిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపస్తున్నాయి. దీంతో వీరంతా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన దుస్థిత ఏర్పడింది.
ఇక్కడ వందలాది చిన్న సంస్థలు వేర్వేరు ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండి ఉన్నాయి. ఇక్కడ కార్మి కులు తమ భుజాలపై ప్లాస్టిక్ సంచులతో ఈ- వ్యర్థాల సేకరణ కోసం తిరుగుతుంటారు. ఆ చిన్న సంస్థల తలుపుల ముందు పోగు చేయబడిన ఉప యోగపడే ఈ-వ్యర్థాలను సేకరిస్తారు. వీరిలో 15 ఏండ్ల అఫ్తాబ్ ఒకరు. సెల్‌ఫోన్ డిస్ప్లేలు, విరిగిన బ్యాటరీలు వంటి వాటిని సేకరించటానికి అతను నలుగురైదుగురు పిల్లలతో పాటు మండుతున్న వేడిలో ఓపిగా వేచి ఉన్నాడు. '' భరించ లేని ఉష్ణోగ్రతను తట్టుకో వటానికి నేను ఎక్కువగా సూర్యోదయానికి ముందే నా రోజును ప్రారంభిస్తాను. కానీ నేను సేకరించిన ఈ- వ్యర్థాల బరువుతో నా భుజాలు బరువెక్కాయి'' అని అఫ్తాబ్ వాపోయాడు. కెమెరాలు, ఎలక్ట్రానిక్ చిప్‌లు, కీప్యాడ్ల వంటి సెల్‌ఫోన్ మిగిలిపోయిన వస్తువులను సేకరించటం సులభమే కానీ అంత లాభాదాయకంగా ఉండదని చెప్పాడు.
2020 గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ ప్రకారం.. 2019లో ప్రపంచం రికార్డు స్థాయిలో 53.6 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను డంప్ చేసింది. అందులో రీసైకిల్ చేయబడింది 17.4 శాతమే కావటం గమనార్హం. ఈ-వ్యర్థాల్లో భారత్ వాటా 32 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నది. వీటిలో అధికం సీలంపూర్ నుంచే ఉన్నది. జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ పొల్యూషన్లోని 2017 పేపర్ ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు భారత్‌లోకి దిగుమతి అవుతున్నాయని అంచనా.
ఈ-వ్యర్థాలు సీలంపూర్‌లో రద్దీగా ఉండే వీధులను నింపుతాయి. ఇక్కడ సంస్థలు వివిధ రకాల ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ-వ్యర్థాలో జీవనోపాధి పొందే చాలా మంది ప్రజలు సీలంపూర్ చుట్టుపక్కల నివసిస్తు న్నారు. వారి జీవన స్థితిగతులు మాత్రం చాలా దుర్బలంగా ఉన్నాయి. అఫ్తాబ్ తన కుటుంబంతో ఒక ఓపెన్ డ్రయినేజీ కాలువకు ఒకవైపున ఉన్న టిన్ షెడ్లో నివసిస్తున్నాడు. రాగి వంటి వ్యర్థాలను దహ నం చేసినప్పుడు వచ్చే పొగతో శ్వాసకోశ సమస్యలు ఏర్పడి తన తల్లి ఈ పని నుంచి విరమించిందని అఫ్తాబ్ చెప్పాడు. తమకూ ఈ పనులు చేయటం ఏ మాత్రమూ ఇష్టముండదనీ, అయితే, తాము నిరుపేదలం కావటంతో తమకు ప్రత్యామ్నాయం లేదని వివరించాడు. ఈ-వ్యర్థాల సేకరణతో తాను రోజుకు సంపాదించేది రూ. 50 నుంచి రూ. 170 వరకు ఉంటుందని చెప్పాడు. ఒక అఫ్తామ్ మాత్రమే కాదు.. ఇక్కడ ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న ఈ-వ్యర్థాలను సేకరించే కార్మికుల జీవన పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
ఇక్కడి పదేండ్ల నుంచి నివసిస్తున్న తాజ్ అనే ప్రముఖ వైద్యురాలు మాట్లాడుతూ.. ప్రతి ఏటా పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. చర్మ వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ తన వద్దకు వచ్చేవారి సంఖ్య పెరిగిందన్నారు. ఆరోగ్య సమస్యలపై ఈ-వేస్ట్ కార్మికుల్లో అవగాహన లేకపోవటమే దీనికి గల కారణమన్నారు. వైర్లు, ప్లాస్టిక్, సాధారణ ఉపకరణాలను వారు కాల్చటం, ప్రమాదకర రసాయనాలతో వ్యవహరించటం శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తున్నదన్నారు. ఇది వారి జీవిత కాలాన్ని నిరవధికంగా ప్రభావితం చేస్తుందని వైద్యురాలు ఆందోళన వ్యక్తం చేశారు.