Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం ముందుకు..
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బహుళ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను సృష్టించడం, విస్తరించడ ం, బలోపేతం చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం), ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ(ఈసీఆర్పీ)-2, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంఅభిమ్), 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జాతీయ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం అమలును సమీక్షించ డానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో క్రిటికల్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేయడం, బలోపేతం చేయడం కోసం వివిధ పథకాలు, ప్యాకేజీల కింద రాష్ట్రాలకు కేంద్ర నిధుల పురోగతి, వినియోగాన్ని వేగవంతం చేయడానికి చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి మనీష్ సిసోడియా , రాష్ట్ర ఆరోగ్య మంత్రులు రాజీవ్ సైజల్ (హిమాచల్ ప్రదేశ్), వీణా జార్జ్ (కేరళ), కె సుధాకర్ (కర్నాటక), ధన్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), టి హరీశ్ రావు (తెలంగాణ), విడదల రజనీ (ఆంధ్రప్రదేశ్), కేశబ్ మహంత (అసోం), అలో లిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), అనిల్ విజ్ (హర్యానా), బన్నా గుప్తా (జార్ఖండ్), మణి కుమార్ శర్మ (సిక్కిం), తిరు మా సుబ్రమణియన్ (తమిళనాడు), టిఎస్ సింగ్ డియో (ఛత్తీస్‌గఢ్), తిరు ఎన్ రంగసామి (పుదుచ్చేరి), ఎల్ జయంతకుమార్ సింగ్ (మణిపూర్), జేమ్స్ కె సంగ్మా (మేఘాలయ), పర్సాది లాల్ మీనా (రాజస్థాన్) , బ్రిజేష్ పాఠక్ (ఉత్తరప్రదేశ్), ప్రభురామ్ చౌదరి (మధ్యప్రదేశ్), రుషికేశ్ పటేల్ (గుజరాత్), నిమిషా సుతార్ (గుజరాత్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ ప్రతి జిల్లా, బ్లాక్‌లలో సంరక్షణ మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మహమ్మారి మనకు నేర్పిందని అన్నారు. పౌరులకు అందుబాటులో సరసమైన, నాణ్యమైన, సమానమైన ప్రజారోగ్య సంరక్షణ సేవలను అందించే దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర నిధుల వినియోగం తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్కువ నిధుల వినియోగాన్ని సమీక్షించే బదులు, రాష్ట్రాలు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, ఆరోగ్య పథకాల సత్వర అమలు కోసం కేంద్రం నుంచి త్వరగా నిధులు కోరాలని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2022 వరకు ప్యాకేజీ అందుబాటులో ఉన్నందున ఈసీఆర్పీ-2 కింద కేంద్రం ఇప్పటికే ఆమోదించిన మొత్తం రూ. 23,123 కోట్ల నిధులను వెంటనే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా సమీక్షించాలని, నిధులు ఉపయోగించకుండా చూసుకోవాలని కోరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పాఠశాలలు, కళాశాలలు, మతపరమైన యాత్రా మార్గాలు, మతపరమైన ప్రదేశాలు మొదలైన బహిరంగ ప్రదేశాలలో టీకా శిబిరాలను నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంఅభిమ్) అతిపెద్ద పథకాలలో ఒకటని పేర్కొన్నారు. ఆరేండ్ల పాటు సుమారు రూ.64,180 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్, జిల్లా, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో, మెట్రోపాలిటన్ ప్రాంతాలలో నిఘా ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, ఆరోగ్య విభాగాలను పటిష్ట పర్చడం, సమర్థవంతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, నిరోధించడం వంటి వ్యాధి నిఘా వ్యవస్థ ను నిర్మించడం ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2022 నాటికి రాష్ట్రాలు ఆరోగ్య వ్యయా న్ని తమ బడ్జెట్లో 8 శాతానికి పైగా పెంచాలని, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం మొత్తం ఆరోగ్య వ్యయంలో మూడింట రెండు వంతులు ఉండాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని తెలిపారు. ఆరోగ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) అనువైనవిగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ రూ. 70,051 కోట్లు అర్బన్ హెల్త్ కోసం మొత్తం నిధులలో 37 శాతం (రూ. 26,123 కోట్లు), గ్రామీణ ఆరోగ్యానికి 63 శాతం (రూ. 43,928 కోట్లు)తో స్థానిక ప్రభుత్వాలకు కేటాయించిందని తెలిపారు.