Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం
- రేపటి నుంచి అమలులోకి
న్యూఢిల్లీ : గోల్డ్, తాజా, శక్తి మిల్క్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్‌పై పాలు విక్రయించే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా మదర్ డెయిరీ సైతం పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు పేర్కొంది. పాలసేకరణ, ఉత్పత్తి వ్యయం పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అముల్, మదర్ డెయిరీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. మార్చిలోనూ మదర్ డెయిరీ లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను మదర్ డెయిరీ విక్రయిస్తోంది.
అయితే, సగటు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో పోలిస్తే లీటర్‌కు రూ.2 పెంపు (4శాతం) తక్కువేనని (జీసీఎమ్ఎమ్ఎఫ్) ఫెడరేషన్ తెలిపింది. పెరిగిన పాల ధరలు గుజరాత్‌లోని సౌరాష్ట్ర, ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబయితో పాటు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతి చోటా వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో అర లీటర్ అమూల్ గోల్డ్ పాలు రూ.31 ఉండగా.. అమూల్ తాజా పాలను రూ.25కు, అమూల్ శక్తిని రూ.28 చొప్పున విక్రయిస్తున్నారు.