Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నా టక మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు : తాము ప్రభుత్వాన్ని నడిపించడం లేదని, కేవలం నిర్వహిస్తున్నామని కర్నా టక మంత్రి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కర్నా టక న్యాయ శాఖ మంత్రి జె.సి. మధుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఉన్న వీడియో ఒకటి విడుదలైంది. ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసింది. బొమ్మై పాలన పట్ల పెరుగుతున్న అసంతృప్తి కారణంగా ముఖ్యమంత్రిగా మరొకరిని బీజేపీ నియమించవచ్చన్న ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. బొమ్మై పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. తాము నిర్వహిస్తున్నామని భావిస్తే.. ఆయన వెంటనే రాజీనామా చేయవచ్చని.. ఆయనకూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. ఇటువంటి ప్రకటన చేయడం బాధ్యతా రాహిత్యమని మంత్రి మునిరత్న పేర్కొన్నారు. అయితే మరో వైపు బిఎస్.యడియూరప్ప కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించారు. తన వయస్సు, పార్టీలో అసమ్మతి కారణంగా యడియూరప్ప గతేడాది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో బొమ్మైను అధిష్టానం నియమించింది.