Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31మందికి మంత్రివర్గంలో చోటు
- హోంశాఖ సీఎం నితీశ్ వద్దే..తేజస్వికి ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి నితీశ్‌కుమార్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కొద్ది రోజులకే మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆగస్టు 9న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కేబినెట్ విస్తరణ చేపట్టగా, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన 31మంది నేతలకు మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రులతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. తేజ్ ప్రతాప్‌కు పర్యావరణం, అడవులు, వాతావరణ శాఖ కేటాయించారు. హోంశాఖ, సాధారణ పరిపాలన, క్యాబినెట్ సెక్రటేరియట్, ఎన్నికలు... మొదలైన విభాగాలను సీఎం నితీశ్ తనవద్దే ఉంచుకున్నారు. సహచర మంత్రులెవరీకి కేటాయించకపోవటం చర్చనీయాంశమైంది. బీహార్ మంత్రివర్గంలో మొత్తం 36మందికి మంత్రి పదవులున్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో ఆర్జేడీకి 16, నితీశ్‌కుమార్ జేడీయూకి 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ అవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో స్వతంత్ర అభ్యర్థికి సైతం మంత్రివర్గంలో చోటు కల్పించారు.