Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా లక్ష్మణ్, యెడియూరప్పలకు చోటు
- అద్వానీ అనుచరగణం ఔట్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గడ్కరి, శివరాజ్ సింగ్ చౌహాన్లను పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, తెలంగాణకు చెందిన కె.లక్ష్మణ్‌కు కొత్తగా తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్లమెంటరీ బోర్డులో ఎప్పటిలానే తిరిగి కొనసాగనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యెడియూరప్ప లేకుండా పార్టీ గెలవడం కష్టమని బీజేపీ నాయకత్వం భావించింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత యెడియూరప్ప బీజేపీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల భోగట్టా. పార్లమెంటరీ బోర్డుసంఖ్యను 7 నుంచి 11కు పెంచారు. బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌కు పార్లమెంటరీ బోర్డులో కొత్తగా చోటు కల్పించారు. ఈ కమిటీల కూర్పులో బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌ను బీజేపీ పక్కాగా అమలు చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హిమంత్ బిశ్వా శర్మకు మార్గం సుగమం చేసిన అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, హర్యానాకు చెందిన మాజీ ఎంపీ సుధా యాదవ్, పంజాబ్‌కు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా, మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ సత్యనారాయణకు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. 15 మందితో ఏర్పాటు చేసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లోకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, రాజ్యసభ ఎంపీ ఓం మాథుర్, మహిళా విభాగం చీఫ్ వనతీ శ్రీనివాసన్లను తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రులు షానవాజ్ హుస్సేన్, జువల్ ఓరాన్, విజయ రహటకర్లను కమిటీ నుంచి తొలగించారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీకి అనుచరగణంగా పేరొందిన గడ్కరి, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ఉద్వాసన పలకడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.