Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : న్యూయార్క్లో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని మలయాళ రచయితలు, దర్శకులు, కళాకారులు, సాంస్కృతిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఖండించారు. రచయిత గొంతు నొక్కేందుకు, ఆయన రాసిన వాటికి శిక్షగా ఈ చర్య ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్దీ శాంతియుతంగా ఉంటారని, మాటలతో మాత్రమే సమాధానమిస్తారని అన్నారు. ఆయనపై దాడి.. ప్రమాదకరంగా ఊపందుకుంటున్న అసమ్మతి యొక్క హింసాత్మక అసహనానికి మరొక ఉదాహరణ అని చింతా రవీంద్రన్ పౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణమైన చర్య, అది చూపే ప్రమాదకర ప్రభావాలకు వ్యతిరేకంగా రచయితలు, కళాకారులు, ఆర్ట్ లవర్స్, పాఠకులు నిరసన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ తరుపున చింతా రవీంద్రన్ పౌండేషన్ జారీ చేసిన ప్రకటన ఇలా ఉంది. 'సల్మాన్ రష్దీ హత్య చేసేందుకు జరిపిన హేయమైన చర్యను ఖండిస్తున్నాం. ఈ చర్య పట్ల చాలా బాధపడ్డాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. రచయితలు సంఘీభావం ప్రకటిస్తున్నాం' అని పేర్కొనబడి ఉంది. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో ఎం.టి. వాసుదేవ నాయర్, అదూర్ గోపాలకృష్ణన్, టిజెఎస్ జార్జ్, కె. సచిదానందన్, ఆనంద్, శశి కుమార్, శశి కుమార్, ఎం.ఎ.బేబి, కెజిఎస్, ఎం. ముకుందన్ తదితరులున్నారు.