Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతియుత ర్యాలీలపైనా దాష్టీకం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ, అదుపు ఉండటం లేదు. శాంతియుత ప్రదర్శనలపైనా ఆ పార్టీ గూండాలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో పేరు కుపోతున్న అవినీతికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం)గత మంగళవారం శాంతియుతం గా నిర్వహించిన ర్యాలీపై దాడి తృణమూల్ దాష్టీకాలకు తాజా ఉదాహరణ. పశ్చిమ మిడ్నాపుర్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో 9 మంది తీవ్ర ంగా గాయపడ్డారు. అటు తృణమూల్ గూండాలు, ఇటు పోలీసులు కూడ బల్కొని నిరసనకారులపై దాష్టీకానికి పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అధికార తృణమూల్ కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెల పాలనీ, జిల్లా మేజిస్ట్రేటుకు మెమోరాండంను సమర్పించాలని పశ్చిమ మిడ్నా పుర్ జిల్లా కమిటీ పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం 11.30 గంటల కు స్థానిక విద్యాసాగర్ హాల్ మైదాన్ నుంచి జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ ప్రారంభమైంది. అవినీతి నేతలందరినీ అరెస్టు చేయాలనీ, అక్రమ ఆస్తులను జప్తు చేయాలని ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేటు కార్యాల యం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారీకేడ్లను పెట్టా రు. కేశ్పూర్లోని సూపా క్రాసింగ్ వద్ద మొదటి దాడి జరిగింది. తృణమూల్ కార్యకర్తలు రోడ్డును నిర్బంధించి సీపీఐ(ఎం) కార్యకర్తల బస్సుపై రాళ్లు రువ్వటం ప్రారంభించారు. తృణమూల్ కార్యకర్తల దాడి ఘటనలో 9 మందికి గాయా లయ్యాయి. ఇటు ర్యాలీ మిడ్నాపుర్లోకి ప్రవేశించగానే పోలీసులు అడ్డుకొని నిరసకారులపై లాఠీచార్జి చేశారు. అయినప్పటికీ, ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు ఐదుగురు సభ్యుల సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం జిల్లా మేజిస్ట్రేటుకు మెమోరాండంను సమర్పించింది. బెంగాల్‌ను అవినీతి రహితం చేయాలనే ప్రచారం ప్రారంభమైందని డిఎం కార్యాలయం వెలుపల జరిగిన భారీ ర్యాలీలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం అన్నారు. అవినీతి విషయంలో బిజెపి, తృణమూల్ పరస్పర అవగాహనతో కలిసి నడుస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్ దాడిని వామపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి.