Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కరోనా వల్ల గురువారం ఉదయం 10 గంటల సమయానికి గడిచిన 24 గంటల్లో 72 మంది చనిపోయారు. 16,251 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 3.62 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, 12,608 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,01,343 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.23 శాతం, పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.50 శాతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటిదాకా 208 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్కరోజే 38.64 లక్షల మంది టీకాలు తీసుకున్నారు.