Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను, ఒక ఫేస్బుక్ ఖాతాను నిషేధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం ఇండియాకు చెందిన ఏడు, పాకిస్తాన్‌కు చెందిన 1 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లు, ఒక ఫేస్బుక్ ఖాతాపై నిషేధం విధించింది.
నిషేధం విధించిన యూట్యూబ్ ఛానెల్స్‌కు 114 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయనీ, వాటికి 85.73 మంది సబ్‌స్రైబర్స్ ఉన్నారని తెలిపింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఇండియాకు వ్యతిరేకంగా ఫేక్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. దేశంలో మత సామరస్యాన్ని రెచ్చగొడుతున్నాయనీ, మత నిర్మాణాలు కూల్చివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని తెలిపింది. డిసెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు 102 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెల్‌లు, అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను నిషేధం విధించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.