Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యి కోట్ల ఆర్జనకు ప్లాన్!
న్యూఢిల్లీ: రైల్వే టికెటింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కలిగి ఉన్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్ డేటాను మానిటైజ్ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని అంచనావేసింది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకు నేందుకు తాజాగా నొటఫికేషన్ ఇచ్చింది. ఈ వార్త బయటకు రావడం తో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ విలువ 4 శాతం మేర పెరిగింది. మరో వైపు ప్రయాణికుల వ్యక్తిగత డేటా గోప్యత ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఐఆర్సీటీసీ ఒక్కటే రైల్వే టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తోంది. దాదాపు 80 శాతం టికెట్ల అమ్మకాలు ఐఆర్సీటీసీ వేదికగానే జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణికుల వివరాలతో పాటు, ప్రయాణికుల లావాదేవీల వివరాలు ఐఆర్సీ టీసీ వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. ఈ డిజిటల్ డేటాను వినియోగించుకుని అదనపు ఆదాయం సమకూర్చుకొనేందుకు తాజాగా ఇ-టెండర్‌ను ఆహ్వానిం చింది. ఈ టెండర్ ఆధారంగా మానిటైజ్ ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ఓ కన్సెల్టెం ట్ను నియమించుకోనుంది. ఇందుకు ఆగస్టు 29న చివరి తేదీగా పేర్కొంది.
ప్రయాణికుల డేటాతో ఏం చేస్తారు?
రైల్వే వద్ద పెద్ద ఎత్తున డేటా కలిగి ఉండటంతో అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని ఐఆర్సీటీసీ భావిస్తోంది. కస్టమర్/వెండర్ అప్లికేషన్ల డేటాను మానిటైజ్ చేయాలనుకుంటు న్నట్లు తన టెండర్ నోటీసులో పేర్కొంది. అదనపు ఆదాయం సంపాదించడంతో పాటు సేవలను మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ డేటాతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్, హౌటల్స్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, వైద్య సంస్థలతో వ్యాపారం చేయనున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ఉదాహరణకు క్యాబ్ బుకింగ్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ప్రయాణికులకు ఆయా సంస్థలు తమ క్యాబ్‌ను బుక్ చేసుకోవాలని నోటిఫికేషన్ పంపించే అవకాశం ఉంటుంది.
మరి గోప్యత మాటేంటి?
రైల్వేలో రోజుకు సుమారు 11 లక్షలకు పైగా టికెట్లు విక్రయమవుతాయి. రోజూ 60 లక్షల మంది ఐఆర్సీటీసీలో లాగిన్ అవుతారు. ఈ లెక్కన దాని వద్ద ఏ స్థాయిలో డేటా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాను ఎలా మానిటైజ్ చేయాలన్నదానిపై ఎంపికైన కన్సెల్టెంట్ సంస్థలు ఐఆర్సీటీసీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీకి సంబంధించి ఐటీ యాక్ట్- 2000, దాని సవరణలు, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ -2018తో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ఈ కన్సల్టెంట్ సంస్థలు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డేటా గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లుగా ఐఆర్‌సీటీ సీ వద్ద పెద్ద మొత్తంలో ప్రయాణికుల వివరాలు ఉన్నా.. వాటిని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒకసారి మానిటైజ్ పేరుతో థర్డ్ పార్టీ చేతికెళ్తే దుర్విని యోగం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్ ఫ్రీడ మ్ ఫౌండేషన్ (IFF) సైతం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో వాహ న్ డేటా బేస్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలను ఢిల్లీలో లక్షిత దాడులకు వినియోగి ంచిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వాణిజ్య ప్రయోజనాల కంటే ముందు పౌరుల హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరి ఐఆర్సిటిసి దీనిపై స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి. 2019లో సైతం ఐఆర్సీటీసీ డిజిటల్ ఆస్తుల మానిటైజ్‌కు సంబంధించి టెండర్లను ఆహ్వానించి.. ఎందుకనో వెనక్కి తగ్గింది.