Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎఎఆర్ఎం బృందం విజ్ఞప్తి
న్యూఢిల్లీ : గిరిజన వ్యతిరేక చట్టాలను, విధానాలను ఆమోదించొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్ఎం) కోరింది. ఈ మేరకు శనివారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎఎఆర్ఎం బృందం సమావేశం అయింది. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ముర్ముకి తమ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపింది. రాష్ట్రపతిని కలిసి వారిలో బృందం సభ్యులు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్, ఎఎఆర్ఎం జాతీయ కన్వీనర్ జితేంద్ర చౌదరి తదితరులు ఉన్నారు.ఆదివాసీ వ్యతిరేక చట్టాలు, విధానాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయబోరని ప్రతినిధి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. జితేంద్ర చౌదరి ఆరో షెడ్యూల్ను బలోపేతం చేయడానికి 125వ సవరణ బిల్లుపై మాట్లాడారు. దీనిని పరిశీలిస్తామని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ఒరిస్సాకు చెందిన సలో మరాండీ ఆదివాసీ భూముల నుంచి అన్యాయమైన తొలగింపు, పంటలను నాశనం చేయడం గురించి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీలకు సర్వీస్ చేస్తున్నందుకు ఎఎఆర్ఎం బందానికి రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలకు విద్య ఆవశ్యకతపై కూడా ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.