Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగతా నిందితులతో మాట్లాడొద్దు..
- వరవరరావు బెయిల్ షరతులు విడుదల చేసిన ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ : ఎల్గార్ పరిషద్ కేసులో ఎన్ఐఏ, ప్రత్యేక న్యాయస్థానం విప్లవ కవి, రచయిత వరవరరావుకు కఠినమైన బెయిల్ నిబంధనలు విధించింది. ఈ కేసులో ఆగస్టు 10న సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేయగా, బెయిల్ షరతుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్ఐఏ శనివారం విడుదల చేశాయి. ముంబయిలోనే నివసించాలని, మిగతా నిందితులతో మాట్లాడొద్ద ని, ఈ కేసుతో సంబంధమున్నవారు తన ఇంటికి వస్తే..వారితో ముచ్చటిం చడానికి వీల్లేదని న్యాయస్థానం షరతులు పెట్టింది. ఈ కేసులో ఆగస్టు 28, 2018లో ఎన్ఐఏ వరవరరావును అరెస్టు చేసింది. ఉపా చట్టం కింద, పలు ఐపీఎస్ సెక్షన్ల కింద పూణె పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఆయన వయస్సు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరుచేసింది. అయితే బెయిల్ షరతులు, ఇతర నిబంధనలు ఎన్ఐఏ, ప్రత్యేక న్యాయస్థానం విడుదల చేశాయి. వీటి ప్రకారం..గ్రేటర్ ముంబయి పరిధిదాటి వరవరరావు ఎక్కడికీ వెళ్లకూడదు. ఒకవేళ ముంబయి నగరం దాటి బయటకు వెళ్లాలనుకుంటే ఎన్ఐఏ కోర్టు అనుమతి తప్పనిసరి. ఆయన ఇంటి చిరునామా, వ్యక్తిగత ఫోన్ నెంబర్, మరో ముగ్గురు దగ్గరి సన్నిహితుల వివరాలు, ఇంటి దగ్గర ఉండే ముగ్గురి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయరాదని పేర్కొన్నది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఇతర నిందితులకు ఫోన్ చేయరాదని, ఎవ్వరికీ అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేయరాదని, ఏ విధమైన సమాచారమార్గంలో వారితో సంబంధాలు నెరపరాదని బెయిల్ కండీషన్లో పేర్కొన్నారు.