Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తిపై ప్రకృతి ప్రతికూల ప్రభావం
- కరువు, వేడి పరిస్థితులతో ప్రపంచ సరఫరాలో క్షీణత
- ధరలకు రెక్కలు.. అనుబంధ రంగాలపై ఎఫెక్ట్
- భారత్, అమెరికా, బ్రెజిల్‌తో పాటు పలు దేశాల్లో ఇదే తీరు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. కరువు, వేడి వంటి పరిస్థితులు కారణంగా ప్రపంచవ్యాప్తంగా తెల్ల బంగారం సరఫరా క్షీణిస్తున్నది. దీంతో భారత్, అమెరికా, బ్రెజిల్ వంటి అధిక పత్తి ఉత్పత్తి, ఎగుమతి దేశాలతో పాటు అనేక దేశాల్లో ఈ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఫలితంగా పత్తి ధరలు అమాంతంగా పెరగుతున్నాయి. దీని ప్రభావం అనుబంధ రంగాలైన వస్త్ర పరిశ్రమపై పడుతున్నది. దీంతో వస్త్రాల ధరలూ పెరుగుతున్నాఇయ. ఈ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనను కలిగిస్తున్నది.
ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. అయితే, ఇక్కడ భారీ వర్షాలు, రసాయన మందుల వాడకం కారణంగా పత్తి పంటలు, ఉత్పత్తిలో చాలా తగ్గుదల ఏర్పడింది. దీంతో భారత్ పత్తిని ఉత్పత్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక చైనాలో వేడి గాలుల ప్రభావం రాబోయే పత్తి పంటపై ప్రభావాన్ని చూపటం ఆందోళన కలిగిస్తున్నది. పత్తిని ఎక్కువగా ఎగుమతి చేసే యూఎస్‌లో తీవ్రమైన కరువు పరిస్థితులు దశాబ్ద కాలంలోనే తక్కువ ఉత్పత్తిని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగుమతిలో రెండో స్థానంలో ఉన్న దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ తీవ్రమైన వేడి పరిస్థితులతో యుద్ధాన్ని చేయాల్సి వస్తున్నది. కరువు పరిస్థితులు ఇప్పటికే పత్తి పంటలను 30 శాతం తగ్గించాయి.
ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్నది. మరోపక్క, ఉత్పత్తి తగ్గిన కారణంగా డిమాండ్ పెరగటంతో తెల్ల బంగారం ధరలు 30 శాతం పెరిగాయి. దీంతో దీని ప్రభావం వస్త్ర పరిశ్రమతో పాటు ఇతర అనుబంధ రంగాలపై పడుతున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీషర్టులు, డైపర్ల నుంచి పేపర్, కార్బోర్డుల వరకు వాటి ధరలను పెంచే ఆలోచనలను వాటి తయారీ, సరఫరాదారులు చేస్తున్నారు. ''పత్తి ధరలు పెరగటం చాలా పెద్ద సమస్య. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఏదైనా ఊరట కలుగుతుందేమోనన్న ఆశతో మా కంపెనీ ఉన్నది'' అని చిల్డ్రన్స్ ప్లేస్ సీఈఓ జేన్ ఎల్ఫెర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులు పత్తి పంటకు నష్టం చేకూర్చినప్పటికీ బ్రెజిల్‌లోని పరిస్థితులు మాత్రం కొంత ఆశను కలిగిస్తున్నాయి. పత్తి ఉత్పత్తిదారుల గ్రూపు అబ్రప ప్రకారం.. అక్కడ పత్తి ఉత్పత్తి 2.6 మిలియన్ టన్నులు లేదా తక్కువగా కనిపిస్తున్నది. ఇక యూఎస్‌లో పత్తి ఉత్పత్తి 28 శాతం తగ్గే అవకాశం కనిపిస్తున్నది. 2009-2010 తర్వాత ఇదే కనిష్టం కావటం గమనార్హం. ప్రపంచంలో పత్తి కొనుగోలుదారులకు వాతావరణం అనేది తలనొప్పిగా మారిందని అబ్రప హెడ్ బుసాటో తెలిపారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బెజ్రిల్ వంటి ప్రాంతాల్లో వర్షాలు పత్తి స్టాక్ నాణ్యతను దెబ్బతీశాయని డైరెక్టర్ ఆఫ్ ప్లెక్సస్ కాటన్ లిమిటెడ్ డైరెక్టర్ పీటర్ ఎగ్లి ఆందోళన వ్యక్తం చేశారు.