Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటంతోనే ఉమ్మడి శత్రువును ఓడించగలం
- మోడీ సర్కార్ అదానీ, అంబానీలది
- రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం: దేశంలో రైతు ఉద్యమ భవిష్యత్తు సదస్సులో వక్తలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజా ఉద్యమం బిజెపిని ఓడిస్తుందని రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక నేతలు స్పష్టం చేశారు. ఉమ్మడి శత్రువు బిజెపిని ఐక్య పోరా టాలతో ఓడించగలమని తెలిపారు. మోడీ సర్కార్ అదానీ, అంబానీలదని, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శిం చారు. సోమవారం స్థానిక గాంధీ పీస్ ఫౌండేషన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్, లెప్ట్ వర్డ్ బుక్స్ సంయుక్తంగా ''దేశంలోని రైతు ఉద్యమ భవిష్యత్తు''పై సదస్సు నిర్వహించారు. ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లెఫ్ట్‌వర్డ్ బుక్స్ ప్రచురించి ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ దావలే రాసిన ''వెన్ ఫార్మర్స్ స్టాడ్ అప్: హౌ ది హిస్టారిక్ కిసాన్ స్ట్రగుల్ ఇన్ ఇండియా అన్ఫోల్డ్'' ను విడుదల చేశారు. రైతుల పోరా టానికి సంబంధించిన ఈ పుస్తకాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ అర్చన ప్రసాద్ పరిచయం చేశారు. అనంతరం జరిగిన సదస్సులో రైతు నేత రాకేష్ టికాయిత్ మాట్లా డుతూ పంజాబ్‌లో మొదలైన రైతు ఉద్యమానికి దేశం మొత్తం అండగా నిలిచిందని, ఢిల్లీ చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర రైతులు, కార్మికులు ఒక్కటైతే దేశం మొత్తం వారి వెనుక ఐక్యమైందని తెలిపారు. ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని, ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఎంఎస్పి కమిటీకి ఎస్‌కెఎం పేర్లను ఇవ్వలేదని, ఎందు కంటే అది ఎంఎస్పి కోసం ఏర్పాటు చేసిన కమిటీ కాదని స్పష్టం చేశారు. ఎంఎస్పిని చట్టబద్ధం చేయడం మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. బడా కంపెనీల కోసం ఏపిఎంసి మండిలను అంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు మార్కెట్ భూములను బడా కంపెనీలకు విక్రయిస్తున్నారని విమర్శిం చారు. రైతు బజార్లను కాపాడేందుకు బీహార్ నుంచి తదుపరి ఆందోళన ప్రారంభం కానుం దని, సరైన ధరల కోసం కూడా ఉద్యమ ం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 6న ఎస్‌కెఎం తదుపరి సమావేశం జరుగుతుందని, అందులో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు ఎంఎస్పి ఇస్తున్నామని చెబుతుందని, కానీ దీనిని పండ్లు, గుడ్లు, పాలు మొదలైన వాటికి విస్తరించాలని సూచించారు.
దేశంలో వ్యవసా య మంత్రిత్వ శాఖ లేదని, ఎందుకంటే వ్యవసాయ పనులు, క్రిప్స్ వ్యాపారం 18 మంత్రిత్వ శాఖల పరిధిలోకి వస్తాయని తెలిపా రు. అందుకనే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఉండాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసేందుకు కంపెనీలు కావాలని, అందుకోసం వ్యవసాయ రంగాన్ని బడా కంపెనీలకు అప్ప గించేలా కేంద్రం తమ ఆధీనంలోకి తీసు కునేందుకు కుట్ర పన్నుతోందని, ఇది రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు పన్నిన ఎత్తుగడని విమర్శించారు. రైతుల భూములు లాక్కోవడమే వారి లక్ష్యమని, దాన్ని ఓడిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పుడు రైతు సంఘాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తో ందని, రైతుల కదలికలకు ప్రభుత్వం భయ పడుతుందని అన్నారు. ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనవద్దని, రైతు సంఘాల పరువు తీసేలా డర్టీ ట్రిక్స్‌ను ప్రయోగిస్తుందని విమర్శించారు. రైతులను కలవకుండా తమను అడ్డుకునేం దుకు బలవంతంగా ప్రయోగిస్తున్నారని, కానీ రైతులను ఇలా భయపెట్టలేరని స్పష్టం చేశారు.
కుల,మత, ప్రాంతాలకతీతంగా రైతు ఉద్యమం: దర్శన్ పాల్
రైతు ఉద్యమం కుల, మత ప్రాంతాలకు అతీతంగా జరిగిందని ఎస్‌కెఎం నేత దర్శన్ పాల్ స్పష్టం చేశారు. 2020 నవంబర్ 7న ఎస్‌కెఎం ఏర్పడిందని, 10 డిసెంబర్ 2021 వరకు పోరాటం జరిగిందని వివరించారు. పోరాటం ప్రారంభమైనప్పుడు కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటికీ రైతుల నుంచి నిరసనలకు మద్దతు లభిస్తోందని తెలిపారు. పశ్చిమ యూపిలోని జాట్లు, ముస్లింలు, రాజస్థాన్‌కు చెందిన గుజ్జర్ మీనా ఐక్యంగా నిరసనలకు దిగారని గుర్తు చేశారు. తమ పోరాటం కొనసాగుతోందని, తాజాగా 75 గంటల పాటు లఖింపూర్ ఖేరీలో 25,000 మందితో ఆందోళన చేపట్టామని తెలిపారు. చారిత్రకంగా అన్ని ప్రాంతాల ప్రజల డిఎన్ఎ ఒక్కటేనని అన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని తెలిపారు. రాజ కీయంగా ముఖ్యమైన నెలలు రానున్నాయని, పోరాటాల రాజకీయ ప్రయోజనాలు రానున్న ఎన్నికల్లో ప్రతిఫలించనున్నాయని అన్నారు.
రైతు ఉద్యమానికి కిసాన్ సభ వెన్నెముక: యోగేంద్ర యాదవ్
రైతు ఉద్యమానికి ఎఐకెఎస్ వెన్నెముక వలే నిలిచిందని రైతు నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఎఐకెఎస్ మెదడుతోనే ఉద్యమం సాగిందని అన్నారు. ఎస్‌కెఎం ఏర్పడకముందే రైతు సమస్యలపై అఖిల భారత రైతు సమన్వ య కమిటీ (ఎఐకెసిసి) ఏర్పడిందని, అందులో కూడా రైతు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకు రావడానికి ఎఐకెఎస్ పాత్రను మరువలేమని అన్నారు. దేశంలోని రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా రావటానికి ఎఐకెఎస్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
రైతు ఉద్యమానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది:హన్నన్ మొల్లా
రైతు ఉద్యమానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే, రైతు ఉద్యమాలు జరిగాయని తెలి పారు. తెలంగాణలోని సాయుధ రైతాంగ పో రాటం, మహారాష్ట్రలోని వర్లీ ఆదివాసీ పోరాట ం , బెంగాల్‌లోని తెగాబా పోరాటం, కేరళలోని పున్నప్ర వాయలార్ పోరాటంతో పాటు అస్సాం, పంజాబ్ రైతుల పోరాటం వంటి అనే క రైతు పోరాటాల చరిత్ర మనకుందని తెలి పారు. రైతు సమస్యలపై తమ ఉద్యమం ఆగ లేదని, కొద్ది విరామం మాత్రమేన ని పేర్కొన్నా రు. తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్నామని, కానీ ఇచ్చిన హామీలు నెర వేర్చలేదని అన్నారు. ప్రభుత్వం వేసిన ఎంఎస్పి కమిటీలో రైతు వ్యతిరేక చట్టాలకు అనుకూలంగా ఉన్నవారే సభ్యులుగా ఉన్నారని, ఇటువంటి కమిటీ గతంలో సుప్రీం కోర్టు కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇలాంటి కమిటీల వల్ల ఉపయోగం ఏమీ లేదని అన్నారు.
రైతులకు పైసా రుణమాఫీ చేయలేదు...కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల రుణమాఫీ: అశోక్ ధావలే
దేశంలో రైతుల ఆత్మహత్యలను ఆపేందు కు ఒక్క పైసా రుణమాఫీ కూడా చేయలేదని, అదే మోడీ పాలనలో కార్పొరేట్లకు మాత్రం రూ.11 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే విమర్శిం చారు. అంబానీ, అదానీ మోన్శాంటో వంటి కంపెనీల కోసం ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. వారంతా రైతు ఉద్యమానికి శత్రువులని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టా లను రద్దు చేయకుంటే, ఎంఎస్పి, సేకరణ ముగిసి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆగిపోయి ఉండవచ్చని అన్నారు. ఆహార భద్రత కూడా అంతమై, ఆ రంగం అంబానీ, అదానీలకు చేరుతుందని పేర్కొన్నా రు. దీన్ని రైతులు అర్థం చేసుకున్నారని, అందుకే పోరాటం చేశారని తెలిపారు. విద్యుత్ బిల్లు ఆమోదం పొందితే, గహాల విద్యుత్ బిల్లులు నాలుగైదు రెట్లు పెరుగుతాయని అన్నారు. ఇది విద్యుత్ రంగ ప్రైవేటీకరణ కోసం తీసుకొచ్చారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ప్రమాదకరమని అన్నారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటన మోడీకి హెచ్చరికని తెలిపారు. అదానీకి సహాయం చేయడానికి ఎంఎస్పిని చట్టబద్ధం చేయడం లేదని మాలిక్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. రైతులపై ఈడి, సిబిఐ, ఆదాయపు పన్ను వంటివి ప్రయోగించి ఆపలేరని అన్నారు.
మోడీ కార్మిక, కర్షక ఉమ్మడి శత్రువు: తపన్ సేన్
ఉత్పత్తి వర్గాల వల్ల దేశం నడుస్తోందని, ఇప్పుడు ఆయా వర్గాల ఉమ్మడి శత్రువు మోడీ సర్కార్‌పై పోరాడుతున్నామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పేర్కొన్నారు. కార్మి క ఉద్యమాలకు రైతుల ఆందోళనలు అపార మైన శక్తి కలిగినవని పేర్కొన్నారు. తమకు రైతు ఉద్యమం విశ్వాసాన్ని కల్పించిం దని, ఎస్‌కెఎం ఆందోళనలకు కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చా యని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడ్డాయని, కానీ రాష్ట్రాలు ఇలాంటి చట్టాలను రూపొందించాయని తెలిపారు. ఎం ఎస్పిని చట్టబద్ధం చేసేందుకు చట్టం తీసుకు రావడానికి కేంద్రం ఇంకా సిద్ధంగా లేదని అన్నారు. కార్పొరేట్ వర్గం సామాన్య ప్రజలను దోపిడి చేసేందుకు ప్రయత్నిస్తోందని, మన భవిష్యత్తును మనమే రాసుకోవాలని సూచిం చారు. తామంతా పోరాటంలో గెలిచా మని, కానీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
వ్యవసాయ కార్మిక ఉద్యమ డిమాండ్లకు ఎస్‌కెఎం మద్దతు ఇవ్వాలి: బి.వెంకట్
రైతు ఉద్యమంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు సంపూర్ణంగా పాల్గొన్నార ని ఎఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఈ పోరాటంలో తమ పాత్రను పోషించారని పేర్కొన్నారు. ఎందుకంటే వ్యవ సాయ చట్టాల వల్ల నష్టం రైతులకు మాత్రమే కాదని, వ్యవసాయ కార్మికులకు పూర్తిగా నష్టం చేస్తాయని అన్నారు. విద్యుత్ బిల్లు, వన్ నేషన్...వన్ రేషన్ పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఫుడ్ కూపన్ తీసుకొ చ్చేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శిం చారు. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికు లు మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి రైతు ఉద్యమంలో ఐక్యంగా భాగస్వామ్యం అయ్యారని తెలిపారు.
వ్యవసాయ కార్మికులు డిమాండ్లను కూడా ఎస్‌కెఎం తీసుకోవాలని, అందరం కలిసి కార్పొరేట్లను, బిజెపిని ఓడించలగమని అన్నారు. ఆ రకంగా పుచ్చలపల్లి సుందరయ్య పేదలంతా ఐక్యం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి విజూ కష్ణన్, కోశాధికారి కష్ణ ప్రసాద్, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధూ, సిఐటియు నేత ఆర్.లక్ష్మయ్య, ఐద్వా నేతలు ఆశాశర్మ, మెమునా మొల్లా, ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య పాల్గొన్నారు.