Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పి కమిటీ తొలి భేటీ
- కీలక అంశాలపై విస్తత చర్చ
- సెప్టెంబర్‌లో కమిటీ చివరి సమావేశం
- బహిష్కరించిన ఎస్‌కెఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మూడు అంశాలపై నాలుగు ఉప కమిటీలు ఏర్పాటు చేయాలని ఎంఎస్పి కమిటీ నిర్ణయించింది. సోమవారం నాడిక్కడ నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్ఎఎస్సి)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఎంఎస్పి, ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తొలి సమావేశంలో కీలక అంశాలపై విస్తత చర్చ జరిపింది. మాజీ కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజరు అగర్వాల్ నేతత్వంలోని కమిటీలో ఆయనతో సహా 26 మంది సభ్యులు ఉన్నారు. కమిటీలో ముగ్గురు సభ్యులను ఎస్‌కెఎం ప్రతిపాదించాల్సి ఉండగా దాన్ని తిరస్కరించింది. ఇతర కారణాలు రీత్యా నీతి అయోగ్ సభ్యుడు రమేష్ కూడా హాజరు కాలేదు. ''జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, దేశం మారుతున్న అవసరాలను దష్టిలో ఉంచుకుని పంటల విధానంలో మార్పు చేయడం, ఎంఎస్పిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడం'' వంటి మార్గాలపై చర్చించింది. ''కమిటీ పరిశీలించి సిఫార్సు చేయాల్సిన మూడు అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వబడింది. ఇది ఏమి, ఎలా చేయాలి, ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా చేసింది. విజయవంతమైన నమూనాలు, అభ్యాసం వంటి అంశాలపై చర్చించాం'' అని కమిటీ సభ్యుడు బినోద్ ఆనంద్ తెలిపారు. సిఎన్‌ఆర్‌ఐ రైతు సంఘంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనంద్ మాట్లాడుతూ ఎస్‌కెఎం ప్రతినిధులు రోజంతా సమావేశానికి హాజరుకాలేదని చెప్పారు.
నాలుగు సబ్ కమిటీలు
''సుదీర్ఘ చర్చల తరువాత మూడు తప్పనిసరి అంశాలపై నాలుగు సబ్ గ్రూప్‌లు లేదా కమిటీలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది'' అని తెలిపారు. మొదటి సబ్ కమిటీ హిమాలయ రాష్ట్రాలతో పాటు పంటల విధానం, పంటల వైవిధ్యం, ఆ రాష్ట్రాల్లో ఎంఎస్పి మద్దతును ఎలా నిర్ధారించాలో అధ్యయనం చేస్తుందని చెప్పారు. మైక్రో ఇరిగేషన్‌పై రెండో సబ్ కమిటీ, ఐఐఎం అహ్మదాబాద్ నుండి సుఖ్‌పాల్ సింగ్ నేతత్వంలో మైక్రో ఇరిగేషన్‌ను రైతులు కేంద్రీకతం చేయడం ఎలాగో అధ్యయనం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌ను ప్రభుత్వ రాయితీల ద్వారా నిర్వహిస్తున్నామని, దీని కోసం రైతుల డిమాండ్‌ను ఎలా ఉత్పత్తి చేయాలనే విషయాన్ని బందం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. మూడో సబ్ కమిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నేతత్వంలో సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులతో సహా 'జీరో బడ్జెట్ బేస్డ్ ఫార్మింగ్'ను అధ్యయనం చేస్తుందని, రైతుల ఏకాభిప్రాయాన్ని రూపొందిస్తుందని తెలిపారు. నాలుగో సబ్ కమిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) నేతత్వంలో హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (సిఆర్ఐడిఎ), నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ (ఎన్బిఎస్ఎస్ఎల్యుపి), మరో ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా పంటల వైవిధ్యం, పంటల విధానాన్ని అధ్యయనం చేసి నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. ''నాలుగు గ్రూపులు విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తాయి. కమిటీ చివరి సమావేశాన్ని సెప్టెంబర్ చివరిలో నిర్వహిస్తారు'' అని ఆనంద్ చెప్పారు. ఈ సమావేశానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ నుండి వ్యవసాయ, ఆర్థికవేత్తలు సిఎస్సి శేఖర్, ఐఐఎం అహ్మదాబాద్ నుండి సుఖ్‌పాల్ సింగ్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) సీనియర్ సభ్యుడు నవీన్ పి సింగ్ హాజరయ్యారు. సమావేశానికి హాజరైన రైతు ప్రతినిధులలో జాతీయ అవార్డు గ్రహీత రైతు భరత్ భూషణ్ త్యాగితో పాటు గున్వంత్ పాటిల్, కష్ణవీర్ చౌదరి, ప్రమోద్ కుమార్ చౌదరి, గుని ప్రకాష్, సయ్యద్ పాషా పటేల్ ఉన్నారు. ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని కూడా హాజరయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సీనియర్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.