Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో రైతులను ఓడించలేరు
- డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనే
- తన పదవీకాలం పూర్తైన తరువాత రైతు పోరాటం లో...: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
''ఎంఎస్పీని కేంద్రం అమలు చేయడ ం లేదు. ఎందుకంటే ప్రధాన మంత్రికి అదానీ అనే స్నేహితుడు ఉన్నాడు. అతను ఐదేండ్లలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు'' అని మేఘాల య గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నా రు. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ ) అమలు, చట్టపర మైన హామీపై కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విమర్శలు గుప్పించారు. దేశంలోని రైతులను ఓడించ లేరనీ, వారి డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగుతుందని అన్నారు. నుV్‌ాలోని కిరా గ్రామంలోని గోశాలలో జరిగిన కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ ఎంఎస్పీని అమలు చేయకపోతే, ఎంఎస్పీపై చట్టపరమైన హామీ ఇవ్వకపోతే మరో పోరాటం జరుగుతుందని, ఈసారి అది భీకర పోరాటం అవుతుందని హెచ్చరించారు. ''మీరు ఈ దేశ రైతును ఓడించలేరు. మీరు రైతును భయపెట్టలేరు. మీరు ఈడీ లేదా ఆదాయపు పన్ను అధికారులను పంపలేరు కాబట్టి, మీరు రైతును ఎలా భయపెడతారు?'' అని ప్రశ్నించారు. ''గౌహతి విమానాశ్రయంలో, నేను పుష్పగుచ్ఛం పట్టుకొని ఉన్న ఒక మహిళను కలిశాను. ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే 'మేం అదానీ తరపున వచ్చాం' అని బదులిచ్చింది. దాని అర్థం ఏమిటని అడిగాను. ఈ విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించా మని, అదానీకి విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రధాన పథకాలు, ఔర్ ఏక్ తరV్‌ా సే దేశ్ కో బెచ్నే కి తయారీ హై (ఒక విధంగా దేశాన్ని విక్రయిం చడమే)'' అని మాలిక్ అన్నారు. పానిపట్‌లో అదానీ పెద్ద గిడ్డంగిని నిర్మించి తక్కువ ధరకు కొనుగోలు చేసిన గోధుమలను నిల్వ చేశారని ఆయన తెలిపారు. ''ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు , అతను ఆ గోధుమలను అమ్ముతాడు. కాబట్టి ఈ ప్రధానమంత్రి స్నేహితులు లాభాలు పొందు తారు. రైతులు నష్టపోతారు. దీన్ని సహించేది లేదు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం'' ఆయన చెప్పారు. ప్రస్తుత తన పదవీకాలం పూర్తయ్యాక రైతుల హక్కుల పోరాటంలో పూర్తిగా పాల్గొంటానని చెప్పారు. ''రైతులు మరో నిరసన తెలపాలి. అది జరిగినప్పుడు కులమత భేదాలు పక్కనపెట్టి కలిసి పోరాడాలని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇది సిక్కులు లేదా జాట్ల నిరసనగా భావించవద్దు. కలిసి పోరాడడం నేర్చుకుంటే ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఓడించలేదు. ఇది ప్రతి రైతు కోసం పోరాటం. వారి పొలాలు, ఉత్పత్తులు, పంటల ధర కోసం రైతులు బాధపడుతున్నారు. వారి ఉత్పత్తులు చౌకగా మారుతున్నాయి. ఎరువు, నీటిపారుదల ఖర్చుతో కూడుకున్నది''అని మాలిక్ అన్నారు.