Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని ఆఫర్ :
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఆప్‌ను చీల్చి తమ పార్టీలోకి వస్తే సీఎం పదవిని ఇస్తామనీ.. సీబీఐ, ఈడీ కేసులను మూసివేయిస్తామని బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చినట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీశ్ సిసోడియాపై ఈడీ, సీబీఐ అధికారుల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మనీశ్ సిసోడియా చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. '' బీజేపీ నుంచి రెండు ఆఫర్లు ఉన్నాయన్న మెసేజ్‌తో ఒకరు నా దగ్గరకు రావటంతో నేను ఆశ్చర్యపోయాను. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను చీల్చి బీజేపీలో చేరితో సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు మూసేస్తామన్నారు. అయితే, నేను మహారాణా ప్రతాప్, రాజ్‌పూత్ వారసుడిని. తల నరక్కుంటా కానీ మీటాంటి కుట్రదారులు, అవినీతి పరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి'' అని సమాధానమిచ్చినట్టు సిసోడియా చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అదవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ గురువనీ, ఆయనను మోసం చేయనని తెలిపారు. ఆయన దగ్గరే రాజకీయాలు నేర్చుకున్నాననీ, సీఎం లేదా ప్రధాని కావటానికి తాను రాజకీయాల్లోకి రాలేదని సిసోడియా తెలిపారు.