Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లు రీయింబర్స్ చేయండి
- విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి : ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. సోమవారం నాడిక్కడ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సం దర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిం చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, నిర్వాసితు లకు పునరావాస ప్యాకేజీని తర్వితగతిన ఇవ్వాలని, రెవెన్యూ లోటు (వనరుల లోటు) భర్తీకి నిధులు, జాతీయ ఆహార భద్ర తా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హౌదా తదితర అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వినతిపత్రం అందించారు.
పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లు ఇవ్వండి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 2,900 కోట్లు ఖర్చు చేసిందని, వీటిని వెంటనే రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా రీయింబర్స్ విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణనలోకి తీసుకుని, ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్ చేసేలా చర్యలు తీసుకోవా లని కోరారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయంబర్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.