Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,570 కిలో మీటర్లు, 150 రోజులు
- కన్యాకుమారి నుంచి ప్రారంభం
- 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు
- తెలంగాణలో వికారాబాద్‌లో యాత్ర ప్రవేశం
- ఏపీలో కర్నూల్ జిల్లా ఆలూరులో యాత్ర ప్రవేశం
- రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టాలని కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఉంది: అశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ:దేశంలోని బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర, మహాత్మా గాంధీ వర్థంతి 2023 జనవరి 30న జమ్మూకాశ్మీర్‌లో ముగుస్తుంది. 150 రోజు పాటు సాగే ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంతాలు గుండా 3,570 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. ఈ యాత్రకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నారు. మంగళవారం ఎఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, యాత్ర కన్వీనర్ దిగ్విజరు సింగ్, సమన్వయకర్త జైరాం రమేష్ యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ బ్రోచర్, లోగో, ట్యాగ్‌లైన్ (కదం కదం కలుపుదాం, దేశాన్ని ఏకం చేద్దాం), వెబ్‌సైట్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోకి కర్నూల్ జిల్లా ఆలూరులో యాత్ర ప్రవేశిస్తుంది. అలాగే తెలంగాణలోని వికారాబాద్‌లో యాత్ర ప్రవేశిస్తుంది. ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలు గుండా యాత్ర వెళ్లినప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వంది నాయకులు, కార్యకర్తలు పూర్తిగా 3,570 కిలో మీటర్లు నడుస్తారు. ఆయా రాష్ట్రాల్లో యాత్ర సాగేటప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన మరో వంద మంది కార్యకర్తల బృందం వారితో కలుస్తుంది. రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను యాత్రకు సమీకరిస్తున్నారు. ఈ యాత్ర వెళ్లే మార్గంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కవాతులు నిర్వహించనున్నారు. అందులో పాల్గొనేవారు వారి వారి స్థలాల నుంటి మట్టి, నీరు తీసుకెళ్తారు. ప్రధాన యాత్రలో చేరినప్పుడు అక్కడ మొక్కలు నాటుతారు. భారత్ జోడ్ యాత్ర ప్రతి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందులో చేరే రాజ్యాంగ ప్రతిని అందజేసే సమాంతర ''సంవిధాన్ బచావో యాత్రలు (రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు) కూడా దేశవ్యాప్తంగా ప్రణాళిక చేశారు. యాత్ర సాగే మార్గంలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీ కవాతులను ప్రణాళిక చేస్తుంది. మేఘాలయా ఇప్పటికే ప్రకటించింది.
జైరాం రమేష్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ జోడో (భారత్ ఐక్యత) యాత్ర ఆవశ్యకమని అన్నారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, నిరుద్యోగం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. కులం, మతం, భాష పేరుతో సామాజిక విభజన జరుగుతోందని తెలిపారు. సెప్టెంబర్ 5న భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ 32 విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆగస్ట్ 29న సెప్టెంబర్ 4 ర్యాలీపై మరో 29 విలేకరుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.