Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ
న్యూఢిల్లీ: 'ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇదే ఒక పెద్ద సమస్యగా మారింది' కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ముంబయిలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ 'నాట్కాన్-2022' కార్యక్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ' మీరు అద్భుతాలు చేయగలరు... సహనంతో ఉండగలరు.. నా విన్నపం ఏమిటంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే నా సూచన.
మనం ప్రపంచానికి పోటీగా సాంకేతికత, పరిశోధనలు విజయవంతంగా నిర్వహించాం. నాణ్యతలో రాజీపడకుండా, ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నాలు చేశాం. నిర్మాణంలో అత్యున్నత సామాగ్రిని కలిగి ఉన్నాం. మన దేశమే మనకు అతిపెద్ద మూలధనం. కానీ ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకో లేకపోవడమే అతిపెద్ద సమస్య' అని పేర్కొన్నారు.