Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్ బానో దోషుల విడుదలను నిరసిస్తూ విద్యార్థులు, కార్యకర్తల నిరసనలు
బెంగళూరు : బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. బెంగళూరులోని ప్రీడమ్ పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు సోమవారం ఆందోళనలు చేపట్టారు. 11 మంది దోషులకు జీవిత కారాగార శిక్ష అనగా.. మరణించేంత వరకు జైలులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విప్లవ గీతాలు ఆలపించిన మహిళలు, బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, కర్నాటక మహిళా దౌర్జన్య విరోధి ఒక్కూటా, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, స్వరాజ్ అభియాన్ కర్నాటక, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిజర్జీస్ తదితర సంఘాలు ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. ఆందోళన చేపట్టిన వారిలో ప్రముఖ దివంగత రచయిత గౌరీ లంకేశ్ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. బాలన్ కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. బేటీ బచావో అగ్ర వర్ణాల కుమార్తెలకు మాత్రమేననీ, దళితులు, గిరిజనులు, ముస్లిం, కూలీల కుమార్తెలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉంచాలనీ, గతంలో కోర్టులూ దీన్ని సమర్థించాయన్నారు. బెంగళూరులో స్వామి శ్రద్ధానంద అనే వ్యక్తి తన భార్యను సజీవంగా పూడ్చి పెట్టాడనీ, సుప్రీంకోర్టు.. అతడికి చనిపోయింత వరకు జైలులోనే మగ్గిపోవాల్సిందేనంటూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.