Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెర్సిడజ్ బెంజ్ సీఈఓ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు మెర్సి డజ్ బెంజ్ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తమ మొత్తం అమ్మకాల్లో 25 శాతం విద్యుత్ వాహనాలు ఉం డొచ్చని ఆ కంపెనీ ఇండియా ఎండి, సిఇఒ మార్టిన్ సువెంక్ పేర్కొన్నారు. ఈ జర్మనీ కంపెనీ బుధవారం భారత మార్కెట్లోకి తన మెర్సిడజ్ -ఎఎంజీ ఇక్యుఎస్ 53 4మాటిక్ను విడుదల చేసింది. ఈ సెడాన్ విద్యుత్ కారు ఎక్స్‌షోరూం ధరను రూ.2.45 కోట్లుగా నిర్ణయించింది. నవంబర్ నుంచి దీని డెలివరీలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2021లో భారత్‌లో ఈ కంపెనీ 11,242 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది ప్రథమార్థంలోనే 7,573 యూనిట్ల అమ్మకాలు చేసినట్టు ప్రకటించింది.