Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొననున్న 3,500 మంది ఉద్యోగులు, అధికారులు
న్యూఢిల్లీ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) ఉద్యోగులు, అధికారులు ఈనెల 30న దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు నిర్ణయించారు. 2017 నుంచి పెండింగ్లో ఉన్న వేతన సవరణ సహా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ ఆందోళనకు దిగనున్నారు. ఇందులో 3500 మందికి పైగా నాబార్డు ఉద్యోగులు, అధికారులు పాల్గొననున్నారు. వేతన సవరణపై తుది పరిష్కారంపై సంతకం చేయటం, అమలు చేయటంలో అతి ఆలస్యం చేసినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని నాబార్డు యూనియన్లు తప్పుబట్టాయి. వేతన సవరణలో జాప్యం నాబార్డు ఉద్యోగులను ఆందోళనకు గురిచేసిందని ఆలిండియా నాబార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఎన్బీఈఏ) ఈనెల ప్రారంభంలో తన సమ్మె నోటీసులో పేర్కొన్నది. నాబార్డు ఉద్యోగుల వేతనాలను సవరించటంలో 'వర్ణించలేని జాప్యం' కారణంగా అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్న ప్రస్తుత వాతావరణంలో నిజమైన వేతనాల పరంగా నష్టపోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.